నూతన సంవత్సరం వేళ యూరోపియన్ దేశాలకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు షాకిచ్చాయి. ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న గ్యాస్ రవాణాను జనవరి 1న న్యూఇయర్ సమయంలో అనూహ్యంగా నిలిపేసింది. దీంతో ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత రెండేళ్లకుపైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. ప్రస్తుతం కూడా తీవ్ర దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనబడడం లేదు. అయితే రష్యా నుంచి ఐరోపాకు గ్యాస్ సరఫరా అవుతుంటుంది. అయితే ఉక్రెయిన్ భూభాగం నుంచే పైపులైన్ ద్వారా వెళ్తోంది. అయితే ప్రస్తుతం రష్యా.. ఉక్రెయిన్‌పై భీకరదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఆదాయ వనరులపై దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ మీద నుంచి వెళ్తున్న గ్యాస్ రవాణాను నిలిపివేస్తూ.. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టొచ్చని భావించింది. ఈ నేపథ్యంలో ఐరోపాకు ఉక్రెయిన్ మీద నుంచి వెళ్తున్న గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. అలాగే రష్యా కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మొత్తానికి నూతన సంవత్సరం వేళ ఐరోపాకు శత్రు దేశాలకు షాకిచ్చాయి. దీంతో ఐదు దశాబ్దాల గ్యాస్ రవాణా ఆగిపోయింది. అత్యంత శీతాకాలంలో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఐరోపాలో భారీ డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి: Rajasthan Borewell Incident: అద్భుతం.. 10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా బాలిక..
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రష్యన్ ప్రవాహాలు తమ భూభాగం అంతటా నిలిచిపోయాయని కైవ్‌లోని ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వాస్తవానికి ఐరోపా-రష్యా మధ్య కూడా ఒప్పందం ముగుస్తోంది. కానీ అంతకంటే ముందుగానే ఉక్రెయిన్-రష్యా మధ్య రాజకీయ తగాదాలు నెలకొనడంతో పుతిన్ సర్కార్ ముందుగానే నిలిపేసింది. 2009లో కూడా ఉక్రెయిన్ మీదుగా యూరప్‌కు వెళ్లే రష్యన్ ప్రవాహాలు దాదాపు రెండు వారాల పాటు నిలిచిపోయాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతల సమయంలో 20 కంటే ఎక్కువ దేశాలు ప్రభావితమయ్యాయి. 2006లో స్వల్ప అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Chandrababu: సినీ పరిశ్రమపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు