Boat Sink: అంతర్యుద్ధాలు, తీవ్రవాదం, హింస నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటూ ప్రతీ ఏడాది కొన్ని వేల మంది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారు సముద్రంలో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా మరోసారి లిబియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. లిబియా మధ్యదరా సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల బాట పట్టనున్నారు. సెప్టెంబర్ లో విదేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు యూరప్ లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ సెప్టెంబర్ రెండో వారంలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. అంతకుముందు రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు.
Technical Recession: ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో భయపడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కరోనా మహమ్మారి, పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్భణ పరిస్థితులు ప్రపంచాన్ని మాంద్యం దిశగా వెళ్లేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేస్తున్నాయి.
Iraq Transportation Project: ఆసియాను యూరప్‌తో అనుసంధానం చేసేందుకు ఇరాక్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ మెగా ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఇరాక్ ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ శనివారం 17 బిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ. 1400 కోట్లు) రవాణా ప్రాజెక్ట్ కోసం ప్రణాళికను ప్రకటించారు.
భూమిపై మరో శాటిలైట్ కుప్పకూలేందుకు సిద్ధం అవుతోంది. 1360 కిలోల శాటిలైట్ భూమిపై క్రాష్ కానుంది. యూరప్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన ‘‘ఏయోలస్’’ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం చివరి అంకానికి చేరుకుంది. 320 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగున్న ఈ అంతరిక్ష నౌక వేగంగా తన ఇంధనాన్ని కోల్పోతోంది. దాదాపుగా దాని ఇంధన నిల్వలు క్షీణించాయి. అయితే ఉపగ్రహానికి సంబంధించిన లేజర్ పరికరాలు ఇంకా పనిచేస్తున్నాయి. ఈ శాటిలైట్ కు చెందిన సైన్స్ పరికరాలను ఏప్రిల్…
India becomes Europe's largest supplier of refined fuels: యూరప్ దేశాలకు అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా భారత్ నిలిచింది. భారత్ నుంచి గణనీయంగా శుద్ధి చేసిన ఇంధనం యూరప్ కు ఎగుమతి అవుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయికి ఇంధన ఎగుమతులు చేరాయి. అనలిటిక్స్ సంస్థ Kpler వెల్లడించిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి యూరప్ కు ఇంధన ఎగుమతులు పెరిగాయి. రోజుకు 3,60,000 బ్యారెళ్ల…
Migrants missing after boat sinks off Tunisia: మంచి జీవితం కోసం యూరప్ వలస వెళ్తాం అనుకున్న వలసదారుల ఆశలు అవిరయ్యాయి. మధ్యదరా సముద్రంల ట్యూనీషియా తీరంలో పడవ మునిగిపోవడంతో 20 మందికి పైగా వలసదారులు గల్లంతయ్యారు. ఆఫ్రికా నుంచి మధ్యదర సముద్రం మీదుగా ఇటలీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో ట్యూనీషియా తీరంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.