అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్న ఈటల.. వ్యూహం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు.
ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు ఎంపీ డీ.శ్రీనివాస్ తోను ఆయన కుటుంబ సభ్యులతోను కలిసి రహస్య చర్చలు చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కూడా సమావేశమయ్యారు. సానుభూతి సంపాదించే పనిలో భాగంగానే ఈటల అన్ని పార్టీల నేతలతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఇలా అన్ని పార్టీల నేతలతో ఆయన రహస్య చర్చలు జరపడంపై తెలంగాణలో పెద్ద చర్చ నడుస్తోంది. ఏ వ్యూహంతో రాజేందర్ వీరందరిని కలుస్తున్నారన్నది పెద్ద చర్చ. అయితే సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజురాబాద్ నుంచి ఇండిపెండెంట్ గా ఈటల బరిలోకి దిగబోతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా రాజేందర్ అన్ని పార్టీల నేతలతో కలుస్తున్నారట. ఈటల టీఆర్ఎస్ ని వీడటం ఖాయం! ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖరారే! అది ఇప్పుడా? ఎప్పుడా? అనేది తేలాల్సివుంది.
Also Read
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!