తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించడంపై మాజీ మంత్రి ఈటల స్పదించారు. గత మూడు రోజులుగా పథకం ప్రకారం వేల ఎకరాల భూమి ఈటల కబ్జా పెట్టారని…వేల కోట్ల డబ్బులు సంపాదించాడని ప్రచారం చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ కబ్జాలు చేశాడని… ప్రజలు అసహించుకునేలా ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. 2002లో మెదక్ జిల్లా పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడనై మధుసూదనాచారి ఆధ్వర్యంలో పార్టీలో చేరానాని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు టీఆర్ఎస్ లో పని చేశా… 2004లో కమలపూర్ లో గెలిచానని తెలిపారు. పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి, మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ కు పార్టీకి మచ్చ తెచ్చే పని నేను చేయలేదని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా గుర్తు చేశారు ఈటల.