తనకు ఆత్మగౌరవం కంటే పదవి గొప్పకాదు అని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్.. ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా.. విచారణకు సైతం ఆదేశించారు సీఎం కేసీఆర్.. అయితే, ఈ పరిణామాల తర్వాత వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనని ప్రకటించారు.. భూ కబ్జా ఆరోపణలు కట్టుకథలుగా కొట్టిపారేసిన ఆయన.. 20 ఏళ్లుగా ఈటల అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు.. నా ఆస్తులపై విచారణకు సిద్ధమని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని కోరారు.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై ప్రచారం చేశారని.. అంతిమ విజయం ధర్మానిదే అని స్పష్టం చేశారు.
ఇక, 2016లో ఒక హ్యాచరీ పెట్టాలని నిర్ణయించుకున్నాం. అత్యంత వెనుకబడిన అచ్చంపల్లి, రూ.6లక్షల చొప్పున కొన్నామని తెలిపారు మంత్రి ఈటల.. 40, 50 ఎకరాలు కొన్నాం. మళ్లీ 7 ఎకరాలు కొన్నాం. కెనరా బ్యాంక్ ద్వారా రూ.వంద కోట్ల రుణం తీసుకుని హ్యాచరీ అభివృద్ధి చేశాం.. విస్తరించడం కోసమే భూములు కొనుగోలు చేసినట్టు తెలిపారు.. రూపాయి అక్కరకు రాని భూములు తీసుకున్నాం.. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా చెప్పాం.. భూకబ్జా ఆరోపణలు అత్యంత నీచమైనది అని మండిపడ్డారు… 1986లో హ్యాచరీలోకి అడుగుపెట్టాం. నేను మా మేడం కలిసి పెట్టాం. వరంగల్‌లో 1992లోనే హ్యాచరీతోనే అభివృద్ధి చేశామని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.. యాంజల్‌లో 2004 వరకు 170-180 ఎకరాలతో ఎదిగానని.. బంజారాహిల్స్‌లో సీఎం కేసీఆర్ చెప్పడంతోనే 2007లో 2,100 గజాల భూమి కొన్నా… దానిపై ఇంకా కిరికిరి నడుస్తుంది.. ఇంకా ఇల్లు కట్టుకోలేదన్నారు.. తాను ఆత్మను అమ్ముకొనే వ్యక్తిని కాదన్నారు