మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చేశారు. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి. అక్రమాలకు పాల్పడిన ఈటెలను వెంటనే అరెస్ట్ చేయాలి. 155 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేసినట్లు నేను ఆధాలు ఇస్తున్నఅని చెప్పిన ఆయన 200.ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నడు. ఈటల స్వంత గ్రామం కమలాపూర్ లో రెండు ఎకరాలు మాత్రమే ఉంది. ఈ రోజు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది.పౌల్ట్రీ ఫామ్ ద్వారా సంపాదించానంటున్న ఈటల.. ఆయన కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా.. 2004 ఎన్నికల అఫిడవిట్ లో జమున పేరు మీద 14 ఎకరాలు.. ఇద్దరి పేర్ల మీద 30 కి మించి లేదు. 2018 ఎన్నికల అఫిడవిట్ లో 69 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న మాట్లాడుతూ 200 ఎకరాలు అని చెప్పారు. ఈటెల అవకతవకలపై సీఎం కేసీఆర్ విచారించాలి. ఈటెల పై విచారణ సవ్యంగా జరగాలంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసైన్డ్ భూములను మళ్లీ పేదలకే పంచాలి అని తెలిపారు.