తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రాజేందర్ స్పీకర్‌కు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను పంపనున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు రాజేందర్ ప్రకటించారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని… బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్…. ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఎవరో రాసిన లేఖతో వెంటనే విచారణ ఎలా చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, ఈ నెల 11 తర్వాత ఈటల బీజేపీ పార్టీలో చేరనున్నారు.