ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్. ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు ఈటల. అయితే ఈటల వ్యాఖ్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల ప్రయత్నాలు ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కెసిఆర్ నాయకులుగా తయారు చేశారని.. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సిఎం కెసిఆర్ స్పందించారంటే అది నియంతృత్వం కాదు ప్రజాస్వామ్యం అని కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ వల్ల తెలంగాణ వచ్చిందని.. ఎంతో మంది టీఆర్ఎస్ లో చేరారు.. వెళ్లిపోయారు.. బయటకు వెళ్ళేవారు ఇలాగే విమర్శలు చేస్తారని చురకలు అంటించారు. కన్న తల్లి లాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశరని.. హుజూరాబాద్ ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. కెసిఆర్ ను విమర్శిస్తే.. సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని మండిపడ్డారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడన్నారు..ఇప్పుడేమో నియంతా అంటున్నారని ఫైర్ అయ్యారు.