హుజూరాబాద్ ప్రజలంతా ఈటల రాజేందర్‌కు గోడి కట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్.. హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేశామని వెల్లడించారు.. అయితే, వాపును చూసి ఈటల బలుపుగా భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు గంగుల… రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరి ఎందుకు ఎట్టాలో ఈటల చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. రైతు బంధుకు చెక్ తీసుకుని వాడుకున్నావు కదా అందుకు గోరి కడతావా? మీ సతీమణి జమున సమైక్య రాష్ట్రం బాగుందని అన్నారు.. అంటే మీకు తెలంగాణ ఇష్టం లేదా? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్నింటినీ వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు..
ఇక, బీజేపీ మీద అభిమానం ఉన్నా.. నువ్వు బీజేపీలో చేరడం రావడం ద్వారా అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిని అగౌరవపర్చడం ద్వారా ప్రజలు నిన్ను విస్మరిస్తున్నారన్న ఆయన.. ఆత్మగౌరవము ఎక్కడ ఉంది? అని ఎద్దేవా చేశారు.. ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పండి.. తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర కావాలని కోరుకున్నారు.. అదే చెప్పండి. అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ లో రైతు హత్యలు పింఛన్ లు రైతు బందు పథకాలు వద్దని హుజూరాబాద్ ప్రజలకు చెప్పండి అంటూ సవాల్ చేశారు మంత్రి గంగుల.. ఇక, హుజూరాబాద్‌లో అభివృద్ధి శూన్యం అని ఆరోపించిన ఆయన.. ఈటల అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.. తన భూములు రెగ్యలరేజేషన్ చేయాలి అడిగారు గాని అభివృద్ధి ఫలాలు అడగలేదని.. ప్రజలందరూ ఈటలకు గోరి కట్టేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు.