ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా.. ! కేసీఆర్.. నా మీద పోటీచేయి అంటూ బహిరంగల సవాల్ చేశారు.
బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడు ఈటల అని అనుకుంటున్నారు… పదేసి లక్షలు దళితబంధు ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. నేనే వాళ్ల గుండెళ్లో ఉన్నా.. రేపు ఎన్నికల్లో చూసుకుందాం అని వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.. ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారని హెచ్చరించిన ఆయన.. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట.. అంటూ ఎద్దేవా చేశారు. దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్‌కు ప్రేమే లేదని మండిపడ్డారు ఈటల.. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న.. ఒడ్డెక్కినాక బోడమల్లన్న రకం కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.