కేసీఆర్ రా.. దమ్ముంటే నాపై పోటీ చేయి.. హరీష్‌రావు రా.. ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విసిరిన సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. హుజూరాబాద్ లో స్వాగతం చూస్తే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని అర్థమవుతోందన్నారు.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి.. కానీ, బీజేపీ నుండి పోటీ చేసే ఈటెల రాజేందర్ నన్ను చూసి ఓటు వేయమంటున్నారని ఎద్దేవా చేశారు.. బీజేపీలో ఉంటు ఆత్మ వంచన చేసుకొని ఆత్మగౌరవం అంటున్నాడని మండిపడ్డ ఆయన.. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇస్తే బీజేపీ ఏం ఇచ్చింది? అని ప్రశ్నించిన హరీష్.. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు.. పోటీ ఉన్నది టీఆర్ఎస్, బీజేపీ మధ్యే అన్నారు.
బీజేపీ వల్ల ధరలు పెరిగాయి.. అన్ని ప్రైవేట్ చేసిన బీజేపీ వైపు ఉందామా? సంక్షేమ పథకాలు ఇచ్చిన టీఆర్ఎస్ వైపు ఉందమా? అని ప్రశ్నించారు హరీష్‌రావు.. ఇక, ఈటల రాజేందర్ రైతు బంధు వద్దు అంటున్నాడు.. వద్దు అన్నవాళ్లను ఏం చేయాలో ప్రజల చేతిలోనే ఉందన్నారు.. సంక్షేమ పథకాలను విమర్శించే ఈటల రాజేందర్ గురించి ప్రజలు ఆలోచించాలన్న ఆయన.. రైతు బంధు వద్దన్న ఈటల రాజేందర్.. రూ.పది లక్షలు రైతు బంధు తీసుకున్నాడని ఎద్దేవా చేశారు.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశమివచ్చిన కేసీఆర్‌ను రా అంటున్నాడు అంటూ ఫైర్ అయిన హరీష్… బీజేపీలో చేరాక ఈటల రాజేందర్ భాష మారింది.. ఓటమి భయంతో మాటలు జారుతున్నాడని కామెంట్ చేశారు. ఇక, ఈటల దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా ఒక్కడబుల్ బెడ్ రూం కూడా కట్టలేదని మండపడ్డ హరీష్.. అన్ని నియోజవర్గాల్లో డబుల్ బెడ్ రూంలు కడితే హుజురాబాద్ లో ఎందుకు కట్టలేదు.? అని ప్రశ్నించారు..
ఈటల రాజేందర్ గెలిస్తే ఒక వ్యక్తి గెలుస్తాడు.. కానీ, ప్రజలు ఓడిపోతారని వ్యాఖ్యానించారు హరీష్‌రావు.. ఎంపీగా బండి సంజయ్ గెలిస్తే ఒక పది లక్షల పని చేసిండా…? అని ప్రశ్నించిన ఆయన.. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ పనిచేయకపోతే ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఎం చేస్తాడో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.. కానీ, హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లే కాదు.. ఖాళీ జాగాలు ఉన్న వాళ్లకు కూడా ఇళ్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం అన్నారు. కాళేశ్వరం నీళ్ల తొలి ఫలితం హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలకే దక్కిందన్న హరీష్‌రావు.. అసలు ఎమ్మెల్యే పదవికి ఈటల ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. పెంచి పెద్ద చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండె మీద తంతే ఎలా ఉంటాదో ఈటల రాజేందర్ వ్యవహారం అలా ఉందని హరీష్.. తండ్రి లాంటి కేసీఆర్‌ను తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద తన్నింది ఈటల రాజేందరే అన్నారు.. ఆత్మగౌరవం అంటూ.. గడియారాలు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు, టీ-షర్ట్‌లు పంచుతున్నారని.. అందుకే గడియారాలు నేలకేసి కొడుతున్నారని సెటైర్లు వేశారు.. ఈటల ఎకరం అమ్ముతా.. ఎలక్షన్ గెలుస్తా అన్నాడు.. అమ్మిండు పంచుతూనే ఉన్నాడని కామెంట్ చేశారు హరీష్‌రావు.. హుజురాబాద్‌లో పోటీ రెండు గంటల భూమికి రెండు వందల ఎకరాల మధ్య పోటీఅన్న ఆయన.. గెల్లు శ్రీనివాస్ కు రాష్ట్ర క్యాబినెట్ ఆశీర్వాదం ఉంది.. గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని చెప్పారు హరీష్‌రావు.