హుజురాబాద్ లో పద్మశాలి సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… మాజీ మంత్రి ఈటలను ఎన్ని సార్లు పద్మశాలి భవనం అడిగిన ఇవ్వని మాజీ మంత్రి. ఈ రోజు పద్మ శాలీలకు ఒక ఎకరం భూమి కోటి రూపాయలతో భవన నిర్మాణం పత్రాలు ఇప్పించిన ఘనత కేసీఆర్. ఈ భూమిని రెండు రోజుల్లో నిర్మించుకొనుటకు టెండర్లు పిలిచి త్వరలో భవన నిర్మాణం చేపడుతం. ఉద్యమాల్లో జోలె పట్టి కేసీఆర్ ను ఆదుకున్న ఘనత పద్మశాలీలది అన్నారు.
ఈ రోజు నేతన్నలు సమాజంలో ముందుండాలని నేతన్నలు నిచ్చిన బతుకమ్మ చీరలు ఈ రోజు ప్రభుత్వం కొని ఆడుకుంటుంది. గతంలో కరెంటు లేక నేతన్న నష్టాల్లో ఉండే. హుజురాబాద్ లో అభివృద్ధి చేయలేక కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరి పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి. బీజేపీ పార్టీకి ఓటు వేస్తే గాస్ పెట్రోలు ధరలు పెంచుమన్నట్లు అని తెలిపారు. కాబట్టి రాబోయే ఎన్నికలు కీలకం. ఈటల గెలిస్తే బీజేపీ లో ఇంకో ఎం ఎల్ ఏ అవుతాడు. తెరాసకు ఓటు వేసి గెలిస్తే ప్రజల గెలుపుగా అభివృద్ధితో ముందుకు పోతుంది. బీజేపీ,కాంగ్రెస్ లు ఢిల్లీ పార్టీలు. తెరాస రాష్ట్రం ఇంటి పార్టీ, మనం సాధించుకున్న పార్టీ అని పేర్కొన్నారు.