ఉద్యమకారుడు పోచమల్లును టీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు పోచమల్లు తెరాసలోకి వచ్చాడన్నారు. ఈ రోజు గెలిచేది న్యాయం, ధర్మం అని.. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదన్నారు. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పదన్న ఈటల, ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరిండని హరీష్ రావు కామెంట్స్ చేశారు. తల కిందికి కాళ్లుపైకి పెట్టిన ఈటల గెలవడని మంత్రి జ్యోస్యం చెప్పారు. గెల్లు శ్రీను టీఆర్ఎస్వీ నుండి 2001 నుండి పోరాడిండు.. ఉస్మానియాలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఊరుకిచ్చిన వ్యక్తి గెల్లు శ్రీను అన్నారు. ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తుల గెలుపు కాయం.. ఈటల చేత్తిర్లు, గడియారాలు పంచిన గెలిచేది తెరాస నేనన్నారు. హుజురాబాద్ అడ్డా తెరాస అడ్డా అంటూ మంత్రి హరీష్ రావు తెలిపారు.