‘గెల్లు’ను బానిస కాదు.. జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం అందికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ… విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపింది.. మరోవైపు.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ పాదయాత్రలు, సభలు, సమావేశాలు జరుగుతున్నా.. ఆయనే అభ్యర్థి అని ఇప్పటి వరకు అధిష్టానం తేల్చింది లేదు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి వేటలో ఉంది.. అయితే, గెల్లు శ్రీనివాస్ యాదవ్.. కేసీఆర్ బానిస అంటూ ఈటల రాజేందర్ కామెంట్ చేయడంపై టీఆర్ఎస్ మండిపడుతోంది… ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. గెల్లును ఈటల బానిస అనడం భావ్యం కాదన్నారు.. ఇది ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డ ఆయన.. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు.. ఆ నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడేనని గుర్తుచేశారు.
ఇక, ఈటల రాజేందర్.. హుజురాబాధ్‌లో బీసీ… శామీర్‌పేట్‌లో ఓసీ అంటూ సెటైర్లు వేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.. హుజురాబాద్ ప్రజలు ఈటలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించిన ఆయన.. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుందని.. గతంలో సుమన్, కిశోర్ లాంటి వాళ్లకు పార్టీ అవకాశం కల్పించింది.. గెల్లు శ్రీనివాస్ కు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారని వెల్లడించారు.. నాగార్జున సాగర్ బైపోల్‌లో జానారెడ్డికి పట్టిన గతే.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు పడుతుందని జోస్యం చెప్పారు మంత్రి తలసాని.. గతంలో ఆరు సార్లు కేసీఆర్ దయతోనే ఈటల విజయం సాధించారన్న ఆయన.. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవుపలికారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!