హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాడని కుండ బద్దలు కొట్టారు కోమటి రెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ 5 వేల కోట్లు ఖర్చు చేసిందని నిప్పులు చెరిగారు. హుజురాబాద్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అని మండిపడ్డారు. హుజురాబాద్ ప్రజలు అదిరి పోయే తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు.…
ఎవరేమి కామెంట్స్ చేసినా.. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని…హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ఊహించినదేనని..హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలం అయ్యారని నిప్పులు చెరిగారు. ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని.. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ తో…
హుజురాబాద్ కౌంటింగ్ మొదటి రౌండ్ లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ వచ్చారు. తొలిరౌండ్‌లో బీజేపీకి 4,610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ కు 4,444, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. అయితే…ఈ కౌంటింగ్ లో టీఆర్‌ఎస్ కు షాక్ తగిలింది. కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తు వలన తమకు నష్టం జరిగిందని టీఆరెస్ శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో వాపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్‌ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్‌ఎస్‌కు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇందులో… టీఆర్‌ఎస్ పార్టీకి 503 ఓట్లు పోల్ కాగా… బీజేపీ పార్టీకి 159 ఓట్లు వచ్చాయి. అలాగే… కాంగ్రెస్ పార్టీ కి 32 ఓట్లు పోల్…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప పెద్దగా ఏమీ జరగలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఊపిరి పీల్చుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేకమైనది కావడంతో నాయకుల్లో గుబులు పట్టుకుంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవ్వరికి లాభిస్తుందోనని నాయకులు ఆందోళనలో ఉన్నారు. హోరాహోరిగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 7గంటల వరకు 86.40 శాతం పోలింగ్ నమోదు అయింది. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా పోలింగ్ జరగడంతో ఎవ్వరికి ఎక్కువ…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల కు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే… ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన ఈ ఉప ఎన్నికలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజురాబాద్ వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్కల్ లో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్న కార్యకర్తల్లో మహిళలు…
హుజురాబాద్‌లో గెలుపు బీజేపీకి అవసరం… ఈటల రాజేందర్‌కి అత్యవసరం. ఈటల దశాబ్ధాల రాజకీయ భవిష్యత్ ఈ ఎన్నికతో ముడిపడి ఉంది. దుబ్బాకలో గెలిచిన తర్వాత.. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక హుజురాబాద్. టీఆర్‌ఎస్‌కు ధీటుగా, పోటీగా బీజేపీ కూడా చతురంగ బలగాలను మోహరించింది. బీజేపీ ప్రచారానికి ఫలితం దక్కుతుందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే కసితో ఉంది కమలదళం. దుబ్బాక పోరులో విజయం సాధించడం, గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చూపించడంతో.. కమలంపార్టీ నేతల్లో…