హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాడని కుండ బద్దలు కొట్టారు కోమటి రెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ 5 వేల కోట్లు ఖర్చు చేసిందని నిప్పులు చెరిగారు. హుజురాబాద్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అని మండిపడ్డారు. హుజురాబాద్ ప్రజలు అదిరి పోయే తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. శత్రువు కు శత్రువు మిత్రుడన్నట్టు ఈటెలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కోమటి రెడ్డి. కాగా… ఆరు రౌండ్లు ముగిసే సరికి… బీజేపీ లీడు లో ఉన్న సంగతి తెలిసిందే.