హుజురాబాద్ ఉప ఎన్నిక మినీ రాజకీయ యుద్ధాన్ని తలపించింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ చేయని ప్రయత్నం లేదు. ఒకరి మీద కరు విమర్శలు ప్రతి విమర్శలతో మాటల దాడికి దిగారు ఆయా పార్టీల నేతలు. అధికార పార్టీ దొంగల పార్టీ అని బీజేపీ వాళ్లు అంటే .. టీఆర్‌ఎస్ పార్టీనే దొంగల పార్టీ అని బీజేపీ నాయకులు ఒకరి పై…
జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని శివమ్ గార్డెన్ లో జరుగుతున్న BJP జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటల రాజేందర్ హుజారాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తరువాత మొదటిసారి జిల్లాకు రావడంతో బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ ..కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందన్నారు. దీనిని నియంత్రించే శక్తి ఒక్క…
రంగారెడ్డి జిల్లా బీజేపీ శిక్షణ తరగతుల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో.. హుజూరాబాద్‌లో కేసిఆర్ నియంతృత్వంతో స్వేచ్ఛను హరించారన్నారు. స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టారు. అందుకే అక్కడ ప్రజలు బయటికి మాట్లాడకుండా ఉండి అవకాశం వచ్చినపుడు ఓటుతో తమ శక్తిని చూపించారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కోరలు పీకారు. చెంప చెళ్లుమనిపించి…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఎత్తు బంగారం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆయన వెంట స్థానిక బీజపీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. కల్లాల వద్ద ఉన్నా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. దళిత బంధుతో దగా చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని రాష్ర్ట ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. జాతర…
టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని..కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేడు పాల్వంచలో పర్యటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాల్వంచ తెలంగాణ నగర్ లో ఈటలకు ఘనస్వాగతం పలికారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదని మండిపడ్డారు. ఈ తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని.. అందుకే వారికి ఇళ్ల పట్టాలు…
కేంద్రంపై నిందలు వేసి లబ్ధి పొందండం కేసీఆర్‌కు బాగా అలవాటైందని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైపు కల్లాల్లో రైతులు ధాన్యం పోసి కొనాలంటుంటే యాసంగి వడ్ల పంచాయతీని…
సొంత స్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురింపించారు. 2014లో రాష్ర్ట అప్పులు రూ.65వేల కోట్లు ఉండగా.. ఏడున్నరేళ్లలో ఆ అప్పును రూ.4 లక్షలకు కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన ఆరోపించారు. ప్రతి నెల రూ.65 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి…
రైతుల ఉసురు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులపై కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సీజన్‌లో ధాన్యం ఎంతయినా కొనాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అయినా కేసీఆర్ వచ్చే సీజన్‌కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవ్వరూ ముందుకు పోలేదని కేసీఆర్…
ఎవ్వరు ఎప్పుడు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. తాజాగా పూనమ్‌కౌర్ గురునానక్ జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్, పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హుజురాబాద్ బైపోల్ గెలిచిన ఈటల రాజేందర్ గెలుపు చారిత్రాత్మ కమన్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ ఎన్నికలు గెలుపు, ఓటముల గురించి పూనమ్ స్పందించింది. ఈటల రాజేందర్‌ను స్పెషల్‌గా పూనమ్ కలిసింది. అంతేకాకుండా ఆయనకు శాంతి కపోతమైనా పావురాన్ని ఈటల రాజేందర్‌తో కలిసి ఎగుర…
కేసీఆర్ అనాలోచితనిర్ణయం వల్ల రాష్ర్ట ఆర్థికస్థితి దిగజారిందని ఈట రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్‌పై విమర్శల బాణాలను సంధించారు. పైరవీలు చేసుకున్న వాళ్లకే బిల్లులు చెల్లిస్తున్నార న్నారు. రైతు రుణ మాఫీలో 24వేల కోట్లలో 5వేల కోట్లు కూడా చెల్లిం చలేదు. ఒకవేళ ఇచ్చినా డబ్బు కేవలం రైతుల వడ్డీ కట్టాడానికే సరి పోయింది. ఒక రైతుబంధు ఇచ్చి రైతులకు రావాల్సిన ఇన్‌పుట్ సబ్సీడీ, ఫసల్…