హుజురాబాద్ కౌంటింగ్ మొదటి రౌండ్ లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ వచ్చారు. తొలిరౌండ్‌లో బీజేపీకి 4,610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ కు 4,444, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. అయితే…ఈ కౌంటింగ్ లో టీఆర్‌ఎస్ కు షాక్ తగిలింది. కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తు వలన తమకు నష్టం జరిగిందని టీఆరెస్ శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో వాపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు ఆ విషయం మరోసారి వార్తల్లోకి వస్తోంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ‘చపాతీ రోలర్’ గుర్తుపై ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. ఆయన మొదటి రౌండ్లో 122 కోట్లు సాధించి ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తున్నారు. కౌంటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఎన్ని ఓట్లు పొందుతారో అని టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. అలాగే… మరో స్వతంత్ర్య అభ్యర్థి… వజ్రం గుర్తుకు 113 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.