హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్‌ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్‌ఎస్‌కు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇందులో… టీఆర్‌ఎస్ పార్టీకి 503 ఓట్లు పోల్ కాగా… బీజేపీ పార్టీకి 159 ఓట్లు వచ్చాయి. అలాగే… కాంగ్రెస్ పార్టీ కి 32 ఓట్లు పోల్ అయ్యాయి.