హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. నాయకుల మధ్య ఉన్న విభేదాలను మరోసారి భగ్గుమనేలా చేసింది. ఓటమికి గల కారణాలపై చర్చించేందుకు ఢిల్లీకి పిలిచిన అధిష్టానం, తెలంగాణ నాయకులతో వార్‌రూమ్‌లో సుధీర్ఘంగా చర్చించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక దానికి ముందూ, వెనుకా జరిగిన పరిణామాలన్నింటిపైనా ఆరా తీసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముందు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పంచాయితీలో టీ.కాంగ్ నేతలు ఉత్తమ్, రేవంత్ వర్గాలుగా విడిపోయారు. ఓటమికి…
మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఒక్క సారిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్… నిర్వహించిన ఓ శుభకార్యంలో సందడి చేశారు. అదేంటి… టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి ఈటల రాజేందర్ వెళ్లడమేంటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమే. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల…
బీజేపీలో ఈటెల స్థానం ఏంటి? సముచిత గౌరవం దక్కుతుందా? సీనియారిటీకి తగ్గ గుర్తింపు లభిస్తుందా? ఇప్పుడు ఇలాంటి చర్చే మొదలైంది. సీనియారిటీకి తగ్గట్టే ఈటలకు పదవీ దక్కుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ ఈటెలకోసం బీజేపీ సిద్ధం చేస్తున్న ఆ కుర్చీ ఏంటి? ఇప్పటికే ఆ కుర్చీలో కూర్చున్నవారి పరిస్థితి ఏంటి? టీఆర్‌ఎస్ నుంచి ఎంత వేగంగా బయటకొచ్చారో.. అంతే వేగంగా బీజేపీలో చేరిపోయారు ఈటల రాజేందర్. అధికార పార్టీని ఢీ కొట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం…
ఆందోల్ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జమున హేచరిస్ విషయంలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమున హేచరిస్ విషయంలో హైకోర్టు ఆదేశాల ప్రకా రమే రీసర్వే జరిగిందన్నారు. జమున హెచరిస్ విషయంలో సీలింగ్ భూముల్లో అన్యాయం జరిగిందంటూ అక్కడి రైతులు న్యాయం కోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో…
ఎన్నికలు డబ్బుమయంగా మారాయనేది పాత మాటే.పంచాయతీ ఎన్నికలకే కోట్లు పెట్టే చోట, అసెంబ్లీకి ఎంత ఖర్చవుతుందో ఊహకు కూడా అందని పరిస్థితి. అయితే భారీ హైప్ వచ్చిన హుజూరాబాద్ ప్రచారం జరిగిన తీరు…. బిజెపి నేతల్ని కంగారు పెడుతుందట. ఈ స్థాయిలో ఖర్చు చేయాలంటే కష్టమే అనుకుంటున్నారట. హుజూరాబాద్ ఎన్నికల ల్లో డబ్బుల ప్రవాహాన్ని చూసిన బీజేపీ నేతలు ఖంగుతింటున్నారు… ఇదేం ఖర్చు , ఇన్ని పైసలు ఎక్కడి నుండి తేవాలి.. రేపు పోటీ చేసే అవకాశం…
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రేమ అమలు అవుతుందని, ఇక్కడ హక్కులు లేవని ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయనకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడు తూ.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.ఈ విజయాన్ని హుజు రాబాద్ ప్రజలకే అంకితమిస్తున్నట్టు ఆయన తెలిపారు. అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా పనిచేశారని ఆయన మండిపడ్డారు. తమ వర్గాన్ని పోలీసులు ఎలా బెదిరించారో తన దగ్గర సీడీలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్‌కు…
హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్త పార్టీ పెట్ట కండి… బీజేపీలోకి రండని ఈటలను ఒప్పించానని ఆయన చెప్పా రు. వారికి బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఆయనకు భరోసా ఇచ్చార న్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని నిరూపించుకున్నామ న్నారు. ఈటల గెలుపును అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకులు శతవిధాల ప్రయత్నించారన్నారు. అయినా కూడా…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ను ఎదురుకునే సత్తాలేక బీజేపీ… కాంగ్రెస్ ను కలుపుకుందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పై ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని… ఢిల్లీలో శత్రువులు- రాష్ట్రంలో మిత్రులుగా పనిచేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. RRR అంటే రాజాసింగ్- రఘునందన్ రావు- రేవంత్…
హోరాహోరిగా జరిగిన హుజురాబాద్ ఎన్నికలు మీనియుద్ధానే తలపించాయి. చివరకు విజయం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను వరించింది. ఈటల గెలుపుపై బీఎస్పీ కన్వీనర్, మాజీ IPS ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. అహంకారంతో, కక్షతో, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ టీఆర్‌ఎస్ పాలకులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి, బహుజన బిడ్డ ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా…
హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడంతో స్పందించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకతో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారని, హుజురాబాద్ ఎన్నికల్లో తెలంగాణవాదులు, ఉద్యమకారులు గెలిచారని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహులు ఓడారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ లో ఓటమి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిది కాదు.. సీఎం కేసీఆర్‌ది అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవిస్తేనే…