తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన ”ఈటల” ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. నాయకుల మధ్య ఉన్న విభేదాలను మరోసారి భగ్గుమనేలా చేసింది. ఓటమికి గల కారణాలపై చర్చించేందుకు ఢిల్లీకి పిలిచిన అధిష్టానం, తెలంగాణ నాయకులతో వార్‌రూమ్‌లో సుధీర్ఘంగా చర్చించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక దానికి ముందూ, వెనుకా జరిగిన పరిణామాలన్నింటిపైనా ఆరా తీసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముందు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పంచాయితీలో టీ.కాంగ్ నేతలు ఉత్తమ్, రేవంత్ వర్గాలుగా విడిపోయారు. ఓటమికి కారణం నువ్వంటే నువ్వే అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.
కాంగ్రెస్‌లోఉండి కొందరు నేతలు టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నారంటూ ఉత్తమ్‌పై అధిష్టానం ముందే ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించడమే కాకుండా, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇప్పించారని ఆరోపించారు పొన్నం. స్థానిక నాయకులను కాదని కౌశిక్‌కు పార్టీలో ఇచ్చిన పదవుల ఉత్తర్వులను వేణుగోపాల్‌కి అందించారు. దీనిపైన ప్రస్తుత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సీరియస్‌గానే రియాక్టయ్యారు. కౌశిక్‌రెడ్డి పార్టీని వదిలి నాలుగు నెలలు అయినా.. హుజూరాబాద్‌లో అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. ఉత్తమ్‌కి సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్‌బాబు, మధు యాష్కిలు మద్దతుగా నిలబడితే, మిగతా నేతలు రేవంత్ వైపు ఉన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇదిలా ఉంటే, కొండా సురేఖకు టికెట్ ఎందుకివ్వలేదో చెప్పాలంటూ వీహెచ్ ప్రశ్నించారు. సురేఖ రాహుల్‌కు రాసిన లేఖను కేసీ వేణుగోపాల్‌కు అందించారు. ఇదిలా ఉంటే, ఈటెలను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్నారంటూ కొందరు నేతలు ఏసీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ బీజేపీలు వందల కోట్లు కుమ్మరించాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన కేసీ వేణుగోపాల్, చివరకు ఓటమిపై కారణాలు వెతికేందుకు ఏఐసీసీ పర్యవేక్షకుడిని నియమిస్తామని తెలిపారు.
తెలంగాణ నేతలతో విడివిడిగా మాట్లాడిన కే.సీ. వేణుగోపాల్ ఓటమిపై సోనియాకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సీనియర్ల సహకారంతో కలిసికట్టుగా పనిచేస్తామని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందన్ని బయట పెట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమికి గల కారణాలపై జరగాల్సిన చర్చ కంటే, నాయకుల మధ్య విభేదాలపైనే ఎక్కువసేపు సాగింది. చివరకి నివేదిక ఇచ్చే బాధ్యత ఏఐసీసీ పర్యవేక్షకుడిని చేతికి వెళ్లింది. ఇటు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంఛార్జ్‌గా ఉన్న తనను సమీక్షకు పిలవక పోవడంపై జగ్గారెడ్డి మండిపడుతున్నారు. అధిష్టానానికి ఆయన లేఖ రాశారు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!