హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడంతో స్పందించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకతో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారని, హుజురాబాద్ ఎన్నికల్లో తెలంగాణవాదులు, ఉద్యమకారులు గెలిచారని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహులు ఓడారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హుజరాబాద్ లో ఓటమి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిది కాదు.. సీఎం కేసీఆర్‌ది అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీ ఆవిర్భవిస్తేనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితం చూసైనా టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.