ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా చర్చగా మారుతున్నాయి కూడా. పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
గెలుపు కోసం అధికార పార్టీ అయితే.. అన్ని వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌశిక్ రెడ్డిని టీఆర్‌ఎస్ లో చేర్చుకోగా.. ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కూడా లాగే ప్రయత్నాల్లో ఉంది. ఇది ఇలా ఉండగా.. ఈ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ మొదలైందని సమాచారం అందుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్… నవంబర్ 5 తర్వాత వెలువడే ఛాన్స్ ఉన్నట్లు.. అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.