ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన పీట్ అనే 79 ఏళ్ల వృద్ధుడు పళ్లకు సర్జరీ చేయించుకున్నాడు. అయితే, సర్జరీ కారణంగా అతని ముఖం మారిపోయింది. రూపం మారిపోయింది, బాగాలేవు అని చెప్పి అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షాకైన పీట్ ఎలాగైనా యంగ్‌గా కనిపించాలని అనుకున్నాడు. వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. అప్పుడే అసలు తిప్పలు మొదలయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ తరువాత ముఖం మరింత దారుణంగా మారిపోయింది. పైగా ప్లాస్టిక్ సర్జరీ చేయడం వలన కనురెప్పలు మూతపడటం…
సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. నామమాత్రంగా మిగిలిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 271 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 124 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.…
ఏకాంతంగా నివశించాలని చాలా మంది కోరుకుంటారు. ఎలాంటి రణగొన ధ్వనులు లేకుండా, కాలుష్యం లేకుండా హ్యాపీగా జీవనం సాగించాలని చాలా మంది అనుకుంటారు. ఇలా అనుకునేవారు పల్లెలు, కొండ ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అయితే, అక్కడ కూడా చాలా మందికి ప్రశాంతత లభించకపోవచ్చు. ఎందుకంటే, ఎక్కడైనా సరే చుట్టూ మనుషులు కనిపిస్తుంటారు. అలా చుట్టూ మనుషులు లేకుండా నివశించాలి అంటే ఒకటి అడవిలో దూరంగా నివశించడం, లేదా సముద్రంలో ఎవరూ లేని దీవిలో ఒంటరిగా నివశించడం.…
క్రికెట్ ఏ జట్టు అయినా టెస్టు ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకే టెస్టుల్లో అన్ని జట్లు రాణించాలని తాపత్రయపడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టుకు టెస్టుల్లో పెద్దగా కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ ఉన్నా ఆ జట్టు చతికిలపడింది. దీంతో ఇంగ్లండ్ టెస్ట్ టీం అత్యంత గడ్డుకాలంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 2021లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. Read Also: IND Vs SA:…
కొవిడ్ మహమ్మారి దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు…ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్‌లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో 24 గంటల వ్యవధిలో లక్షా 6వేల 122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ బాధితుల…
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు. అయితే బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 236 పరుగులకే ఆలౌటైంది. రూట్ (62), మలాన్…
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. బ్రిస్బేన్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 5 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడు పెనాల్టీ పాయింట్లు కోల్పోయిన జట్టు కేవలం 9 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్…
యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఉదయం సెషన్‌లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 152 పరుగులతో భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్ వార్నర్ 94, లబుషేన్ 74, స్టార్క్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్, మార్క్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. లీచ్, రూట్…
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో…
బస్సుల్లో ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. తప్పనిసరి అనుకుంటే ప్రయాణం చేయకతప్పని పరిస్థితి. ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారు బస్సు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సుల్లో లాంగ్ జర్నీ చేయాలంటే ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బామ్మ టికెట్ లేకుండా ఫ్రీగా 3540 కిమీ ప్రయాణం చేసింది. 120 బస్సుల్లో ఒక్కసారి కూడా టికెట్ కొనకుండా ఫ్రీగా ప్రయాణం చేసిందట. అదెలా సాధ్యం అని షాక్ అవుతున్నారా? అక్కడికే వస్తున్నా. ఇంగ్లాండ్‌లో…