ఇంగ్లండ్‌తో గెలవాల్సిన టెస్టులో ఓటమి చెందిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. బర్మింగ్ హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అంతేకాకుండా రెండు పాయింట్లు కూడా కోసేశారు. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్‌లో ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. అటు పాకిస్థాన్ మూడో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 75 పాయింట్లు (52.08 పాయింట్ పర్సంటేజ్) ఉండగా పాకిస్థాన్ ఖాతాలో 44 పాయింట్లు (52.38 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి.
Read Also: IND vs ENG: బ్రాడ్.. నోర్మూసుకొని బ్యాటింగ్ చెయ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా జట్టు కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో 84 పాయింట్లు (77.78 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు ఉంది. సౌతాఫ్రికా ఖాతాలో 60 పాయింట్లు (71.43 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించిన ఇంగ్లండ్ జట్టు తాజాగా టీమిండియాపై కూడా విజయకేతనం ఎగురవేసినా ఆ జట్టు ఏడో స్థానానికే పరిమితమైంది. ఇంగ్లండ్ ఖాతాలో 64 పాయింట్లు ఉండగా 33.33 పాయింట్ పర్సంటేజ్ మాత్రమే ఉంది. డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లను ఇంగ్లండ్ జట్టే (16 మ్యాచ్‌లు) ఆడటం గమనార్హం.