Rohit Sharma: ప్చ్.. ఆ మ్యాచ్ గెలవాల్సింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం, అలాగే సిరీస్ (2-2) సమం కావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ఆ రీషెడ్యూల్ మ్యాచ్ గెలిచి ఉంటే, సిరీస్ భారత్ సొంతమై ఉండేదన్నాడు. ‘‘ప్చ్.. చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సింది. అది గెలకపోవడం నిరాశకు గురి చేసింది. నిజానికి.. ఆ టెస్ట్ సిరీస్ భారత్ గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లపై ప్రభావం అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నా. ఎందుకంటే.. అన్నీ వేర్వేరు ఫార్మాట్లు కదా’’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇదే సమయంలో అక్టోబర్ నుంచి జరగనున్న టీ20 ప్రపంపకప్-2022 టోర్నీపై రోహిత్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతున్నాం. ఇకపై ఆడే ప్రతీ సిరీస్ మాకు చాలా కీలకమైంది. ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ముఖ్యంగా.. ఇంగ్లండ్‌తో పోరు చాలా ఛాలెంజ్ వంటిది’’ అని అన్నాడు. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు ఐర్లాండ్ టీ20 సిరీస్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు కాబట్టి.. బాగానే రాణిస్తారన్న ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. గతేడాదిలోనే జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే! ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో.. 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించడంతో టెస్ట్ సిరీస్ 2-2తో సమం అయ్యింది.
Also Read
- Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
- Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు
- Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
తాజావార్తలు
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?