క్రికెట్ క్రీడాలోకంలో విషాదం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ మంగళవారం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1988, 1996 మధ్య స్మిత్ 62 టెస్టులు ఆడి, 43.67 సగటుతో 4,236 పరుగులు చేశాడు, ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన స్మిత్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్, మాల్కం మార్షల్, పాట్రిక్ ప్యాటర్సన్‌లపై అద్భుతంగా పరుగులు సాధించాడు. అతని…
ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 36 ఏళ్ల వోక్స్ ఇటీవల ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్‌లో కనిపించాడు. ఈ సిరీస్‌లో భజం గాయంతో బ్యాటింగ్ చేస్తున్న అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు 15 సంవత్సరాలు ఇంగ్లాండ్ తరఫున ఆడిన వోక్స్ 2011లో ఆస్ట్రేలియాపై తన T20I అరంగేట్రం చేశాడు. Also Read:Election Code :…
ENG vs IND: లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే విజయ ఆనందం ఆస్వాదించక ముందే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి ఇంగ్లాండ్‌కు షాకింగ్ న్యూస్ ఎదురైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల కోతతో పాటు.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ తగ్గింపు జరగడం ఆ జట్టుకు పెద్ద షాక్‌గా మారింది.…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు పూర్తి విఫలమైంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ బట్లర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో.. జోస్ బట్లర్ వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా.. ఇంగ్లండ్- అఫ్ఘానిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ పై ఆఫ్గాన్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌటయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆసీస్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ తమ అంచనాలను వెల్లడించారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ.. " దక్షిణాఫ్రికాకు మద్ధతిస్తున్నాను. ప్రతి టోర్నమెంట్‌లో గెలిచే వరకు పోరాడతారు. సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. ఈ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంటుంది." అని మైఖేల్ అథర్టన్ తెలిపాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతే…
Mumbai Indians IPL 2025: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించింది. ఈ బాధ్యతను ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కార్ల్ హాప్కిన్సన్‌కు అప్పగించింది. 43 ఏళ్ల హాప్కిన్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు గత 7 సంవత్సరాలుగా ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు ప్రపంచ కప్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. Also Read:…
NZ vs ENG: న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ టిమ్ సౌతీ కెరీర్లో చివరిది. ఈ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ 423 పరుగుల తేడా…