ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆసీస్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి.. ఆసీస్ సూపర్ విక్టరీ సాధించింది. ఇంగ్లండ్‌పై ఆసీస్ 5 వికెట్ల తేడాతో 47.3 ఓవర్లలోనే గెలుపొందింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో జోస్ ఇంగ్లిస్ సెంచరీతో (120 *) అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 88 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. చివరలో మ్యాక్స్‌వెల్ (32*) కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో జట్టుకు విజయాన్ని అందించారు. ఆసీస్ బ్యాటింగ్‌లో మాథ్యూ షార్ట్ (63) , అలెక్స్ కేరీ (69) హాఫ్ సెంచరీలతో రాణించారు. మార్నస్ లబుషేన్ (47) పరుగులు చేశారు. ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేసినప్పటికీ ఆస్ట్రేలియా అలవోకగా విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో మార్క్ ఉడ్, జోఫ్రా ఆర్చర్, కార్సే, ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు.
Read Also: Off The Record: అధికారంలో ఉన్నప్పుడు లైట్..! ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌కు వాళ్లే దేవుళ్లా..?
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డకెట్ సెంచరీ (165) పరుగులు చేశాడు. ఆ తర్వాత జో రూట్ (68) పరుగులతో పర్వాలేదనిపించాడు. జోస్ బట్లర్ (23), జోఫ్రా ఆర్చర్ (21), జామీ స్మిత్ (15), లివింగ్ స్టోన్ (14), ఫిల్ సాల్ట్ (10) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో బెన్ ద్వార్షుయిస్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆడం జంపా, లబుషేన్ తలో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్‌వెల్ కు ఒక వికెట్ దక్కింది.
Read Also: CM Revanth Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులతో సీఎం సమీక్ష..