ENG vs IND: లార్డ్స్‌లో గెలిచినా ఇంగ్లాండ్‌కు సుఖం లేదుగా.. గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG vs IND: లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే విజయ ఆనందం ఆస్వాదించక ముందే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి ఇంగ్లాండ్‌కు షాకింగ్ న్యూస్ ఎదురైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల కోతతో పాటు.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ తగ్గింపు జరగడం ఆ జట్టుకు పెద్ద షాక్‌గా మారింది.
Also Read
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక్క ఓవర్ ఆలస్యం అంటే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు మ్యాచ్ ఫీజులో మొత్తం 10 శాతం ఫైన్ విధించబడింది. స్లో ఓవర్ రేటుకు సంబంధించి జరిమానాతో పాటు, ఇంగ్లాండ్ జట్టుకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025–27 సైకిల్‌లో రెండు పాయింట్ల కోత విధించబడింది. ఈ నిర్ణయంతో ఇంగ్లాండ్ పాయింట్లు 24 నుంచి 22కు తగ్గిపోయాయి. దీనితో WTC స్టాండింగ్స్‌లో ఇంగ్లాండ్ స్థానానికి ఇది భారీ దెబ్బగా మారింది.
Read Also:Pulivendula ZPTC By-Election: కడప జిల్లాలో ఉప ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం..
ఈ తప్పిదాన్ని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంగీకరించడంతో, ఐసీసీ ఎటువంటి విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. జట్టు బాధ్యత వహించిన నేపథ్యంలో జరిమానా విధించి ప్రక్రియ ముగిసిందని ఐసీసీ తెలిపింది. ఈ పెనాల్టీతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ మధ్యే బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక, ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పరంగా జరిగిన ఈ మార్పులు సిరీస్‌లో కీలకంగా నిలవనున్నాయి. ఇక భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అయితే భారత్ మాత్రం ఈ టెస్టును గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో సిద్ధమవుతోంది.
🚨 ENGLAND PLAYERS FINED. 🚨
– England have been fined 10% of their match fees and docked 2 WTC points for maintaining slow overrate at Lord's. pic.twitter.com/f5BP9fbL4V
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2025
తాజావార్తలు
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!