పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరుచోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7కోట్ల నగదు బయటపడింది. మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా యాప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 'బొగ్గు అక్రమాస్తుల కుంభకోణం'పై విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
అక్రమ మైనింగ్ కేసులో మనీలాండరింగ్ నిబంధనల కింద జార్ఖండ్, బీహార్‌లతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే-47 రైఫిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
2021-22 ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే. నాలుగో రోజు చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ ముగియగా.. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. విచారణ జరుగుతోందని ఈడీ అడిగిన ప్రశ్నిలన్నింటికీ సమాధానం చెప్పానని ఆయన వెల్లడించారు.
చికోటి ప్రవీణ్ ని గంటలు తరబడి ఈడీ విచారిస్తుంది .మొదటి రోజు 14 గంటల పాటు విచారించిన ఈడీ.. రెండో రోజు 11 గంటల పాటు విచారించింది. ఇప్పటివరకు 25 గంటల పాటు ఈడీ చికోటి ప్రవీణ్ ను విచారించింది. చికోటి ఆర్థిక లావాదేవులపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా, లేదంటే కాయిన్స్ అక్కడ ఇచ్చి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకున్నారా అనే విషయం మీద ప్రధానంగా…
National herald case - ED seals Young Indian's office: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) సీజ్ చేసింది. ఈ ఘటన గాంధీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. హెరాల్డ్ హౌజ్ భవనానికి సంబంధించిన ఆర్డర్లను కూడా ఈడీ అతికింది.
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. నిన్న సోమవారం ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ రెండో రోజు ఈడీ కార్యాలయంలో విచారణకు బ్యాంక్ స్టేట్మెంట్లతో చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవాలని పేర్కొన్నాడు. తన పేరుతో వచ్చిన ట్వి్టర్, ఫేస్బుక్ అకౌంట్లు ఫేక్ అంటూ అని చికోటి ప్రవీణ్ తెలిపారు. read also: Karthikeya-2: థియేట్రికల్ ట్రైలర్ కు రంగం సిద్థం!…