Mamata Banerjee on Partha Chatterjee Case: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ వ్యవహారంలో తవ్వినా కొద్ది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిలో రూ.21 కోట్లు పట్టుబడగా.. నిన్న మరో రూ.29 కోట్లు, 5 కేజీల బంగారం పట్టుబడింది. దీంతో ఆయన ఎంతపెద్ద స్కామ్ చేశాడో అర్థం అవుతోంది. ఇటీవల ఈడీ
స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సహచరురాలు సినీనటి అర్పితా ముఖర్జీకి సంబంధించి కోల్‌కతాలోని ఓఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. గత శుక్రవారం ఈడీ సోదాల్లో ఆమె ఇంట్లో సుమారు రూ. 21 కోట్ల నగదు, ఆభరణాలు బయట పడగా తాగాజా.. మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. బెల్ఘరియా టౌన్ క్లబ్‌లోని ముఖర్జీ నివాసం నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం…
Supreme Court key judgment on Anti-Money Laundering Cases: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును బుధవారం వెలువరించింది. ఈడీ అరెస్ట్ చేసే అధికారంలో పాటు ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం( పీఎంఎల్ఏ)లోని నేర పరిశోధన, అరెస్ట్ అధికారం, ఆస్తుల అటాచ్మెంట్ మొదలైన నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. మనీలాండరింగ్ అరెస్టులు ‘‘ఏకపక్షం’’ కానది సంచలన ఉత్తర్వుల ఇచ్చింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజనైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోసారి విచారణకు హాజరయ్యారు.
MP Rahul Gandhi detained during protest: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈ రోజు మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించనుంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, కీలక నాయకులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈడీ కేసుతో పాటు ధరలపెరుగుదల, జీఎస్టీపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేపట్టారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కాంగ్రెస్ మార్చ్ ను అడ్డుకోవడంతో నేతలు,…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది.పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది.
బ్యాంకు రుణాల ఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సంబంధించిన కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పురోగతి సాధించారు. నీరవ్‌కు సంబంధించిన ₹253.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ జాబితాలో చరాస్థులైన రత్నాలు, ఆభరణాలతో పాటు బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు.
పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ.20 కోట్ల నగదు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల్లో బయటపడింది. ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్ త్రుణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంటి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై శుక్రవారం ఈడీ దాడి చేసింది. అర్పితా ఇంట్లో నోట్లు గుట్టలు గుట్టలుగా బయటపడింది.