Jacqueline Fernandez: 200 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacqueline Fernandez: ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. సుకేష్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీదారుడని ఆమెకు తెలుసునని ఈడీ విశ్వసిస్తోంది. వీడియో కాల్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తెలిసింది. జాక్వెలిన్‌కు బహుమతులు ఇచ్చినట్లు సుకేష్ అంగీకరించాడు. గతంలో సుకేష్ ఆమెకు రూ.10 కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు ఈడీ గుర్తించింది. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులను రూ.7 కోట్లకు పైగా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు కూడా జారీ చేసింది. ఆ మధ్య జాక్వెలిన్ విదేశాలకు వెళ్లకుండా లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీనిపై ఆమె కోర్టుకు వెళ్లగా.. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయంటూ ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. సుకేష్ చంద్రశేఖర్‌పై 32కి పైగా క్రిమినల్ కేసుల్లో అనేక రాష్ట్ర పోలీసులు, మూడు కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
Cyber Crime: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో 42 శాతం మంది.. ప్రతి 10 మందిలో నలుగురు బాధితులే..!
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా రూ.215 కోట్లు వసూలు చేసినట్లు సుకేష్ చంద్రశేఖర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సుకేష్ ఢిల్లీ జైల్లో ఉన్న సమయంలో.. ప్రధాని కార్యాలయం, న్యాయ శాఖ, హోం శాఖకు చెందిన అధికారిగా నటిస్తూ బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలి భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, తమ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని నడిపిస్తానని సుకేష్ ఫోన్ కాల్స్‌లో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!