“నేను దోషినే అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి,” అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనకు సమన్లు పంపడం ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.
JC Prabhakar Reddy: బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం నాడు జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి ఆయన కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు జరిగాయి. అయితే కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రైవేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది. తాజాగా ఈడీ కార్యాలయంలో…
Delhi Liquor Policy Case-ED raids: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది ఈడీ. ఈ రాష్ట్రాల్లో మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
రెండో రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు. నిన్న మంచిరెడ్డిని 8 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఢించారని ఆరోపణలపై మంచిరెడ్డి విచారిస్తున్న ఈడీ.
నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరయ్యారు.
గత కొన్నేళ్లుగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోమవారం ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎదుట విచారణకు హాజరయ్యారు.