తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో రెండవ ఆడియో విడుదలైంది. ఇదిలా వుంటే.. ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడి అధికారులకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసుకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోపై ఈడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కి ముగ్గురు వ్యక్తులు 400 కోట్లు ఇవ్వజూపారు అని తెలిసింది. పోలీసులు మాత్రం అరెస్ట్ చేసిన వారి గురించి, సీజ్ చేసిన డబ్బులు గురించి చెప్పలేదు.
Read Also: Vellampalli Srinivas: నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తాం.. ఇదే మా ప్రభుత్వం గొప్పతనం..!!
ఇంత సంచలనం గా మారిన ఈ కేసులో పోలీసులు డబ్బు లావాదేవీలు, నేరాన్ని రుజువు చేయడం లో పోలీసులు విఫలం అయ్యారు. కోర్టు మాత్రం రిమాండ్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జాతీయ నాయకత్వాన్ని , జాతీయ పార్టీ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. మీడియా, పత్రికలు పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో డబ్బులు గురించి ఏం చెప్పలేదన్నారు రఘునందన్ రావు. ఒకే సారి రూ.2లక్షల కన్నా ఎక్కువ నగదు తీసుకోని వెళ్లడం మనీలాండరింగ్ కిందకు వస్తుంది.
జాతీయ పార్టీపై సినిమా లో జరిగే విధంగా కొన్ని కల్పిత కథలతో రాష్ట్ర నాయకులు, లోకల్ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వ్యవస్థల పై నమ్మకం లేదు… రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసులు పనిచేస్తున్నారు..రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వారంతా మరబొమ్మలుగా మారిపోయారు. ఈ కేసుపై దృష్టి పెట్టి.. ఈడీ అధికారులు సమగ్ర విచారణ జరపాలని రఘునందన్ రావు తన ఫిర్యాదులో కోరారు.
ఫార్మ్ హౌజ్ లీలలు…ఫార్మ్ హౌస్ పైసలు ” అనే సినిమా కు నిర్మాత, దర్శకుడు సీఎం కెసిఆర్..ఈ సినిమా షూటింగ్ 24 గంటల్లో పూర్తి అయింది..శ్రీనివాస్ గౌడ్ హత్య కు కుట్ర కేసులో చెప్పినట్టే…15 కోట్లు ఇక్కడ కూడా చెప్పారు. ముగ్గురు వ్యక్తుల ఫోన్ లు సీజ్ చేసినం అని చెప్పారు…లంచం ఇస్తా అన్నవాళ్ళను నలుగురు ఎమ్మెల్యే లు ఫార్మ్ హౌస్ కు రమ్మన్నారు..వీరి కార్ లో చూపిన ఆ డబ్బులు ఎక్కడికి పోయినవి ?
రోహిత్ రెడ్డి ఫిర్యాదులో 100 కోట్లు అని రాశారు…ఆ వంద కోట్ల సోర్స్ ఎక్కడిదో దర్యాప్తు చేయాలని ఈడీకి తెలిపానన్నారు రఘునందన్. నా స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారన్నారు.
Read Also: Man Dance with Crocodile : అదేం నీ గర్ల్ ఫ్రెండ్ కాదు.. మొసలితో సాల్సా ఏంటిరా!