Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacqueline Fernandez: నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరయ్యారు. తెల్ల చొక్కా, నలుపు ప్యాంటు ధరించి, న్యాయవాది వేషంలో ఆమె కోర్టులోకి చొరబడినట్లు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జిషీటును సమర్పించింది. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 26న కోర్టు ఎదుట హాజరుకావాలంటూ నటికి సమన్లు జారీ చేసింది. దీంతో జాక్వెలిన్ సోమవారం పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యా ఈ క్రమంలోనే బెయిల్ కోసం నటి తరఫు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఈడీ నుంచి స్పందన కోరింది. రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జాక్వెలిన్ న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. రూ.50వేల పూచికత్తుపై జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో ఆమె పాత్ర ఉందని ఆరోపించినందుకు ఢిల్లీ పోలీసులు ఆమెను ప్రశ్నించడానికి రెండుసార్లు సమన్లు పంపారు. ఈ కేసుకు సంబంధించి గత వారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. విచారణలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుకేష్ చంద్రశేఖర్ మధ్య ఉన్న సంబంధం గురించి అంగీకరించినట్లు ఒక అధికారి పేర్కొన్నారు. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీదారుడని ఆమెకు తెలుసునని ఈడీ విశ్వసిస్తోంది. వీడియో కాల్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తెలిసింది. జాక్వెలిన్‌కు బహుమతులు ఇచ్చినట్లు సుకేష్ అంగీకరించాడు. గతంలో సుకేష్ ఆమెకు రూ.10 కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు ఈడీ గుర్తించింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులను రూ.7 కోట్లకు పైగా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు కూడా జారీ చేసింది. ఆ మధ్య జాక్వెలిన్ విదేశాలకు వెళ్లకుండా లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీనిపై ఆమె కోర్టుకు వెళ్లగా.. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయంటూ ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. సుకేష్ చంద్రశేఖర్‌పై 32కి పైగా క్రిమినల్ కేసుల్లో అనేక రాష్ట్ర పోలీసులు, మూడు కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Chennai: ఆత్మహత్య చేసుకోవడం ఎలా?.. నటించి చూపించబోయాడు.. కానీ..
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా రూ.215 కోట్లు వసూలు చేసినట్లు సుకేష్ చంద్రశేఖర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సుకేష్ ఢిల్లీ జైల్లో ఉన్న సమయంలో.. ప్రధాని కార్యాలయం, న్యాయ శాఖ, హోం శాఖకు చెందిన అధికారిగా నటిస్తూ బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలి భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, తమ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని నడిపిస్తానని సుకేష్ ఫోన్ కాల్స్‌లో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..