Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరోసారి దాడులు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. అతడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంల తన వ్యక్తిగత సహాయకుడు దేవేంద్ర శర్మను అరెస్ట్ చేసినట్టు మనీష్ సిసోడియా తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తన పీఏను అరెస్ట్ చేసిందని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ ద్వారా ఇంటిపై దాడి చేసి బ్యాంక్ లాకర్లను శోధించారని.. తమ గ్రామంలో తనిఖీ చేశారు కానీ తనకు వ్యతిరేకంగా ఏమీ ఆధారాలు లభించలేదని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విటర్ వేదికగా వెల్లడించారు. వారికి అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తన వ్యక్తిగత సహాయకుడిని అరెస్ట్ చేశారని సిసోడియా తెలిపారు.
Bihar: 4వేల దేవాలయాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. 3నెలల గడువు విధించిన సర్కారు
అంతకుముందు అక్టోబర్ 17న మనీష్ సిసోడియాను దేశ రాజధానిలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. అక్కడ తొమ్మిది గంటల పాటు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మనీష్ సిసోడియా.. తనపై పెట్టిన కేసు కుంభకోణంపై విచారించడానికి కాదని.. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌ను విజయవంతం చేసేందుకు ఉద్దేశించిందని ఆయన ఆరోపించారు. బీజేపీతో కోసం పనిచేస్తే తనను సీఎం చేస్తామని చెప్పారని మనీష్ సిసోడియా ఆరోపించారు. అయితే సీబీఐ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. చట్ట ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి సంబంధించి ఆగస్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సిసోడియా అధికారిక నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.