ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. సుకేష్ చంద్రశేఖర్, ఇతరులకు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నాడు ఈడీ చార్జీషీట్ లో ప్రవీణ్ పేరు నమోదు చేసి.. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ అధకారులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ ముందు హాజరుకానున్నారు. రోహిత్ రెడ్డి చేసిన అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఇవాళ ఉదయం రోహిత్ రెడ్డి తరపున ఆయన పీఏ శ్రవణ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
బండి సంజయ్ హిందుత్వం పేరిట ప్రజలని తప్పు దోవ పట్టిస్తే చూస్తూ ఊరుకొమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్ రాలేదు. బండి సంజయ్ మాటలు అబద్దమని మరోసారి రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.