Hemanth Soren: దోషినే అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు.. వీలైతే వచ్చి అరెస్ట్ చేయండి.. జార్ఖండ్ సీఎం సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemanth Soren: “నేను దోషినే అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి,” అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనకు సమన్లు పంపడం ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కేంద్ర బలగాలను ప్రయోగించిందని ఆయన విమర్శించారు. ఈడీ, సీబీఐలకు తాను భయపడనని.. తమను వ్యతిరేకించే ఎవరి గొంతునైనా అణిచివేసేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడమే ఇది అంటూ హేమంత్ సోరెన్ అన్నారు. అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అన్నారు.
Kerala Governor Challenge: స్మగ్లింగ్‌కు ముఖ్యమంత్రి అండ.. నిరూపిస్తే రాజీనామా చేస్తారా..
Also Read
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మైనింగ్ కుంభకోణంలో లాండరింగ్ చేశాడని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడం గమనార్హం. బొగ్గు మైనింగ్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రా సహా మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. జులైలో దాడులు నిర్వహించి మిశ్రా బ్యాంకు ఖాతాల్లోని రూ.11.88 కోట్లు సీజ్ చేసింది. అలాగే ఆయన ఇంట్లో రూ.5.34 కోట్ల అక్రమ నగదు లభించినట్లు వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలతో బిజీగా ఉంటూ పారిపోయిన వ్యాపారులను వదిలివేసిందని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!