ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా బెంగుళూరు నగరంలో వాహనాల వల్ల రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. అయితే తాజాగా బెంగళూరు నగరంలోని పలు కంపెనీలు నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించే దిశగా అనేక చర్యలను చేపట్టాయి. ఇందులో భాగంగానే ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఆఫీసుకు రావడానికి మళ్ళీ తిరిగి వెళ్లడానికి ప్రజా రవాణాలను ఉపయోగించే వారికి ఆర్థిక ప్రోత్సాహాలను ఇచ్చేందుకు కంపెనీలు ట్రై చేస్తున్నాయి. Also read: Riyan Parag: అటు బ్యాటింగ్లో.. ఇటు…
గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యలను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ స్కామ్ లో నలుగురు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై వరాలు జల్లులు కురిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వంట గ్యాస్ ధర వంద రూపాయలకు తగ్గించారు.
ఈ మధ్య లేఆఫ్ లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఆర్థిక కారణాలతో ఇబ్బందులను ఎదుర్కొలేక ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.. టాప్ కంపెనీలు సైతం ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి.. తాజాగా ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ విభాగం నుంచి 43 మందికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికారు… ప్రముఖ ఛానెల్ యూట్యూబ్ మ్యూజిక్‌లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 43 మంది ఉద్యోగులు…
తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చులేకపోతుందని ఏపీ జేపీసీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ పై కొత్త వడ్డీ రేటును ఖరారు చేసింది.
కేంద్ర బడ్జెట్ అంటేనే అందరికీ గంపెడాశలుంటాయి. పైగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల జాతర జరగబోతుంది. దీంతో బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా వరాలు ప్రకటించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మోడీ సర్కార్ మరోసారి వచ్చేందుకు బడ్జెట్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగులైతే ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరీ నిర్మలాసీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎదురుచూస్తు్న్నారు.
విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్మా వద్దు.. జీతాలు పెంచండి అనే అంశంపై మీటింగ్ లో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. 28 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 18వేలు అంగన్వాడీలకు ఇస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో దాన్ని అమలు చెయ్యడం లేదని అన్నారు. కనీస వేతనాలు కార్మికులకు…
తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం…
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 30వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఓటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.