EPFO Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేటు పెరగనుందోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ పై కొత్త వడ్డీ రేటును ఖరారు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వారి ఫీఎఫ్ డబ్బుపై 8.25 శాతం వడ్డీని పొందబోతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలో ఉంచిన డబ్బుపై అధిక రాబడిని పొందబోతున్నారు. ఇంతకుముందు పీఎఫ్ ఖాతాదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం, 2021-22లో 8.10 శాతం చొప్పున వడ్డీని పొందారు. అంటే 2023-24కి పీఎఫ్ ఖాతాదారులు అంతకు ముందు సంవత్సరం కంటే 0.10 శాతం ఎక్కువ వడ్డీని పొందబోతున్నారు.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే తాజాగా పీఎఫ్ వడ్డీ రేటును అధికారికంగా ప్రకటించలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాదారులు ఏ వడ్డీ రేటుతో పొందాలో ఈపీఎఫ్ఓసెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు నిర్ణయిస్తారు. ఈపీఎఫ్ఓ సీబీటీ ముఖ్యమైన సమావేశం ఈ రోజు జరుగుతోంది,. దీనిలో పీఎఫ్ పై వడ్డీకి సంబంధించి నిర్ణయం తీసుకోబడుతుంది. పీఎఫ్ పై వడ్డీ రేటు గురించి అధికారిక సమాచారం కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా తర్వాత ఇవ్వబడుతుంది.
Read Also:Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Live & Update
ఇది ఈపీఎఫ్ వో ట్రస్టీల బోర్డు 235వ సమావేశం. వడ్డీ రేట్లను సీబీటీ సమావేశం అజెండాలో చేర్చాలని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్‌ఓ పీఎఫ్‌పై వడ్డీ రేటును కొంతమేర పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే లక్షలాది మంది ఉపాధి కూలీలు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓకు ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి, ఈపీఎఫ్ఓలో జమ చేసిన డబ్బు అతిపెద్ద సామాజిక భద్రత. ప్రయివేటు రంగ ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా కొంత భాగాన్ని పీఎఫ్ పేరుతో కట్ చేస్తారు. పీఎఫ్ కి కంట్రిబ్యూషన్ యజమాని ద్వారా చేయబడుతుంది. ఉద్యోగం కోల్పోవడం, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు, వివాహం, పిల్లల చదువులు లేదా పదవీ విరమణ జరిగినప్పుడు ఉద్యోగులు పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!