అమెరికా ఎయిర్‌పోర్టులో ఒక మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. సిబ్బందిపై భౌతికదాడికి పాల్పడింది. అంతేకాకుండా చేతికి దొరికిన వస్తువుల్ని విసిరేసింది. అరుపులు, కేకలతో నానా రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్, హెచ్వోడీలుగా పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి హెచ్ఆర్ఏ (HRA)ను పెంచింది. ప్రస్తుతం 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేసిక్ పేపై 24 శాతం హెచ్ఆర్ఏ పెంచారు. రూ.25 వేలకు మించకుండా పెంచిన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.
సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు.
Anant Ambani Wedding : అనిల్ అంబానీ కుమారుడు అనంత అంబానీ వివాహం నేను ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. బాంద్రా కుర్ల కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరుగుతున్న నేపథ్యంలో ముంబై నగరంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. మొత్తం 3 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముంబై నగరంలోని కొన్ని కంపెనీలు వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. నేడు మొదలుకొని జూలై 15…
Microsoft Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత విధించింది. వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్స్ కు చెందిన వారిని తాజాగా విడుదల చేసిన జాబితాలో నుంచి తొలగించినట్లు గ్రీక్ వైర్ అనే మీడియా సంస్థ పేర్కొనింది.
మయన్మార్‌లో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది షాపుల యజమానులు తమ ఉద్యోగులకు జీతాలు పెంచడంతో, వారిని జైలుకు పంపారు. ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని అలాంటి వారి కోసం వెతకాలని ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 82లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడంతో.. పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కాగా.. ఈ ప్రమాదంపై వెంటనే…