విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్మా వద్దు.. జీతాలు పెంచండి అనే అంశంపై మీటింగ్ లో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. 28 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 18వేలు అంగన్వాడీలకు ఇస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో దాన్ని అమలు చెయ్యడం లేదని అన్నారు. కనీస వేతనాలు కార్మికులకు ఇవ్వాలి.. కార్మికులకు అండగా ఉంటామన్నారు. మరోవైపు.. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆమెను సజ్జల బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకానందకి పట్టిన గతే షర్మిలకు పడుతుంది అంటున్నారన్నారు.
Read Also: YCP: కొనసాగుతున్న వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తు..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. జగన్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. మంత్రులకు ఈ పాలనలో స్వేచ్ఛ లేదని ఆరోపించారు. లక్ష మంది అంగన్వాడీలపై ఈ సర్కార్ చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. కాగా.. వారికి జీతం ఇవ్వడానికి డబ్బులు లేవు అని ప్రభుత్వం చెబుతోందని ఆయన తెలిపారు.
Read Also: Flipkart: వందల మంది ఉద్యోగులపై ఫ్లిప్ కార్ట్ వేటు.. అదే అసలు కారణమా?
జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బాలలకు రక్షణ కల్పిస్తున్న అంగన్వాడీలకు రాష్ట్రంలో రక్షణ లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కారించకపోతే ప్రతిపక్షాలు కలసి పోరాడుతామని సూచించారు. తాను ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్భంధం ప్రయోగిస్తే తప్పని చెప్పానన్నారు. అన్ని పార్టీలు అమలయ్యే హామీలు మాత్రమే ఇవ్వాలని ఆయన కోరారు.