ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా బెంగుళూరు నగరంలో వాహనాల వల్ల రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. అయితే తాజాగా బెంగళూరు నగరంలోని పలు కంపెనీలు నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించే దిశగా అనేక చర్యలను చేపట్టాయి. ఇందులో భాగంగానే ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఆఫీసుకు రావడానికి మళ్ళీ తిరిగి వెళ్లడానికి ప్రజా రవాణాలను ఉపయోగించే వారికి ఆర్థిక ప్రోత్సాహాలను ఇచ్చేందుకు కంపెనీలు ట్రై చేస్తున్నాయి.
Also read: Riyan Parag: అటు బ్యాటింగ్లో.. ఇటు డ్యాన్స్లో ఇరగదీసిన పరాగ్..
బెంగళూరు మహానగరంలో ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఉండటం కామన్ గా మారిపోయింది. ఇలాంటి స్థితిలో పీక్ అవర్స్ లో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఘోరంగా తయారవుతున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు నగరంలోని ప్రైవేట్ కంపెనీల సహాయాన్ని తీసుకుంటున్నాయి. కంపెనీలో పనిచేస్తున్న వారి ఉద్యోగులు ప్రజారవానాలను ఉపయోగించుకునేలా చూడాలని ప్రభుత్వం కంపెనీలను కోరింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఇన్సెంటివ్ ఇవ్వడం మొదలుపెట్టాయి కంపెనీలు. వీటితోపాటు కొందరు ఉద్యోగులు కలిసి ఒకే కారులో విధులకు హాజరయ్యాలా కార్ పూలింగ్ ను కూడా ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి.
Also read: Riyan Parag: అటు బ్యాటింగ్లో.. ఇటు డ్యాన్స్లో ఇరగదీసిన పరాగ్..
వీటితోపాటు ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సిడెంట్ ఇవ్వడమే కాకుండా.. కొన్ని కంపెనీలలో మెట్రో పాస్ లు, షెటిల్ సేవలకు సంబంధించిన రియంబర్స్మెంట్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.