ఈపీఎఫ్.. ఎంప్లయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దాదాపు జాబ్ చేసే వారందరికీ తెలిసే ఉంటుంది. సంస్థలు ప్రతి ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ఉద్యోగి శాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తారు. ఉద్యోగులకు భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఈపీఎఫ్. అయితే ఈఫీఎఫ్ లో అందే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఈ కారణంగా లబ్ధి పొందలేకపోతుంటారు. ఈపీఎఫ్ లో చాలా రకాల రూల్స్…
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ అసెంబ్లీలో అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ నుంచి 1,942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీలకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు..
ఇంటెల్ కంపెనీ.. తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్‌కు ఉచిత పానీయాలు తిరిగి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణలోని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. రేపు సాయంత్రంలోపు డీఏ (DA)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటి వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్ మూడో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన నికర విలువ $204 బిలియన్లు.
ఇకపై ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి తీరాల్సిందేనని అమెజాన్ హెచ్చరించింది. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని వారు ఇతర కంపెనీల్లో పని చూసుకోవాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ వార్నింగ్ ఇచ్చారు.
Recover UAN Number: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లోని సభ్యులకు UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కచ్చితంగా అవసరం. ఇది పాస్‌బుక్ లను విలీనం చేయడం, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం లాంటి వాటిని చాలా సులభతరం చేస్తుంది. అయితే ఈ UAN తెలియకపోవడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది లేకుండా EPFO ఖాతాను యాక్సెస్ చేయలేరు. కాబట్టి UANని కనుగొనడానికి చాలా సులభమైన మార్గాన్ని చూద్దాం. తద్వారా మీరు మీ UAN అవసరమైనప్పుడు…
ఆఫీస్ అంటే ఒక సిస్టం.. ఒక పద్ధతి.. కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరి హద్దుల్లో వారుండి ఉద్యోగులు పని చేసుకోవాలి. అంతేకాని ఆఫీస్‌లో తమ ఇష్టప్రకారం నడుచుకుంటామంటే ఏ కంపెనీ ఊరుకోదు. అలాంటిది వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట ఆఫీసులోనే జుగుప్సాకరంగా ప్రవర్తించారు. బహిరంగంగానే శృంగార కార్యకలాపాలకు పూనుకున్నారు.
జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టసభ సభ్యులు ఈ ఆలోచనను ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (OPS) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్)కి బదులుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.