Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఆదివారం మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ముందస్తు జాగ్రత్త చర్యగా ల్యాండింగ్ చేసిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. కోల్‌కతా మీదుగా నడుస్తున్న ఈ విమానం AI174 ఉలాన్‌బాతర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం, సాంకేతిక తనిఖీలు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Emergency Landing: మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది (మొత్తం 167 మంది) ఉన్నారు. ప్రయాణం మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా…
Delhi Visakhapatnam Flight: ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ – విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం AI 451 APU ఢిల్లి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు U-టర్న్ తీసుకొని విమానాన్ని…
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు చాకచక్యంగా దాన్ని వెనక్కి మళ్లించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ప్రాథమిక నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ లోపాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 294 ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు కలవర పెడుతున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి వెళ్లింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విమానం ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. పొగలు, నిప్పురవ్వులు రావడంతో పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.
భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది.
Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలిసింది.
Emergency Landing: లండన్ నుంచి ముంబయికి బయలుదేరిన ఒక విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో టర్కీలోని దియార్బకిర్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి నుంచి 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులు చిక్కుకుపోయారు. వర్జిన్ అట్లాంటిక్ విమానం లండన్ నుండి ముంబయి ప్రయాణానికి బయలుదేరింది. అయితే, సాంకేతిక సమస్య కారణంగా, దియార్ బకిర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. Read Also: Hanu- Prabhas: హనుతో ప్రభాస్ మరో సినిమా?…