అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ప్రాథమిక నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ లోపాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 294 ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంటల్లో చిక్కుకున్న విమానం బోయింగ్ 767-400 నడిపే DL446 విమానం.
Also Read:Kiren Rijiju: హిందువులు మెజారిటీ కాబట్టే, మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు..
అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం, విమానం విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఏటీసీకి సమాచారం అందించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి రప్పించింది. ఎయిర్ పోర్టులో అత్యవసర సేవలకు సమాచారం అందించింది. పైలట్స్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇంజిన్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 – Engine ON FIRE 🔥
Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.
📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq
— RT_India (@RT_India_news) July 19, 2025