Delhi Visakhapatnam Flight: ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ – విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం AI 451 APU ఢిల్లి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు U-టర్న్ తీసుకొని విమానాన్ని ఢిల్లీలోని IGI విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
READ ALSO: తీపి ఆనందం చాక్లెట్ : ఆరోగ్య లాభాలు, నష్టాలు ఇవే….
వాస్తవానికి ఈ విమానం 5 గంటల 20 నిమిషాలకు విశాఖ చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక సమస్య రావడంతో తిరిగి ఢిల్లీ వెళ్లిపోయింది. విమానంలో పవర్ యూనిట్ షట్ డౌన్ అయినట్లు పైలట్ గుర్తించారు.
ఇటీవల కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం 6E-6961 లో కూడా ఇదే విధంగా సాంకేతిక లోపం తలెత్తింది. వాస్తవానికి ఈ ప్రమాద సమయంలో విమానంలో 166 మంది ప్రయాణికుల ఉన్నారు. విమానంలో ఇంధన లీక్ సమస్య గుర్తించిన వెంటనే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కేవలం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన మళ్లీ జరగడంపై విమానాల్లో ప్రయాణించే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.