US: గాల్లో ఉండగా విమానంలో మంటలు.. సేఫ్‌గా ల్యాండింగ్.. వీడియో వైరల్
- గాల్లో ఉండగా విమానంలో మంటలు
- సేఫ్‌గా ల్యాండింగ్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విమానం ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. పొగలు, నిప్పురవ్వులు రావడంతో పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. క్షేమంగా అందరూ కిందకు దిగేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Ritika Singh : కూల్ వెదర్ లో హాట్ ఫొటోస్ తో వేడి సెగలు పుట్టిస్తోన్న రితికా
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఎయిర్‌బస్‌కు చెందిన A321 విమానం హ్యారీ రీడ్ అంత్జాతీయ విమానాశ్రయం నుంచి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్‌లో మంటలు చేలరేగాయి. వెంటనే పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే ఇంజన్‌లో మంటలు చెలరేగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం పొగలు, నిప్పురవ్వలు రావడం కనిపించాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: YS Jagan: నేడు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ!
అయితే విమానం నుంచి శబ్దాలు రావడం చూశామని స్థానిక సాక్షులు పేర్కొన్నారు. పెద్ద శబ్దం వచ్చిందని.. తామంతా బయపడినట్లు వెల్లడించారు. ఇక విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇక ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానాలకు తరలించారు.
ఇదిలా ఉంటే జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. ఇక హాస్టల్‌లో 35 మంది మెడికోలు దుర్మరణం చెందారు. ఇక ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు.
JUST IN: American Airlines flight forced to return to Las Vegas after an engine apparently caught on fire midair.
American Airlines Flight 1665 was in the air for about 10 minutes after taking off from Harry Reid International Airport in Las Vegas for Charlotte, North Carolina.… pic.twitter.com/lkAeDWkJiw
— Collin Rugg (@CollinRugg) June 25, 2025
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..