దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన ఆయన.. ఇక, ట్విట్టర్ యాజమాన్య బోర్డులో చేరడం ఖాయమని అంతా భావించారు.. కానీ, ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు ఎలాన్ మాస్క్.. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు.. ట్విట్టర్‌లో ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు 9.2 శాతం వాటా ఉంది… ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ వాటాల కంటే కూడా ఇది నాలుగు రెట్లు అధికంగా ఉండడం విశేషం కాగా.. ఆయన మాత్రం యాజమాన్య బోర్డులోకి రావడంలేదు.
Read Also: Mekapati Family: గౌతమ్‌రెడ్డి వారసుడిని ప్రకటించిన మేకపాటి ఫ్యామిలీ
ఇక, ఈ పరిణామాలపై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ.. ఎలాన్ మస్క్ ఎంతో మేలైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.. ట్విట్టర్ తన కార్పొరేట్ లక్ష్యాలపై మరింతగా దృష్టి సారిస్తుందని వెల్లడించారు.. కానీ, ట్విట్టర్‌లోని ఇతర వాటాదారులు మాత్రం.. మస్క్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మస్క్ తన నిర్ణయంపై ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు..