Elon Musk: ప్రపంచ కుబేరుడు.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. అంటే.. జీవితంలో ఈ రెండింటికి ఎంతో ప్రాధాన్యతతో పాటు.. ఖర్చుతో కూడుకున్న పనికూడా అని వారి ఉద్దేశం.. జీవితంలో సెటిల్ అయ్యారా? అనేదానికి ఏం చేస్తున్నారు..? ఎంత సంపాదిస్తున్నారు..? సొంత ఇల్లు ఉందా? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి.. చాలా మంది కాస్త సంపాదిస్తే.. అప్పో.. సప్పో చేసి.. ప్రస్తుతం లోన్ పెట్టుకొని అయినా.. సొంత ఇంటి కల నెరవేర్చుకుంటున్నారు. వేతన జీవులు కూడా సాహసం చేసి మరి ఇళ్లు కొంటున్నారు.. కానీ, ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన ఎలన్ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి… తన సంపదతో ఏదైనా ఇట్టే సొంత చేసుకోగలిగే స్థానంలో ఉన్న ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేకపోవడం సంచలనంగా మారిందనే చెప్పాలి.
Read Also: KTR: కేంద్రంపై కేటీఆర్ సెటైర్లు.. అన్నీ పైపైకే..!
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇక, ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఎలన్ మస్క్ సంపద 250 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది.. అంటే రూ.19,06,730 కోట్లకు పైమాటే.. కానీ, ఇప్పటికీ ఆయనకు సొంతిళ్లు లేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఇప్పటి వరకు నాకు సొంత ప్లేస్ అంటూ ఏదీ లేదు.. నేను ఇప్పటికీ నా స్నేహితుల ఇళ్లల్లో ఉంటున్నాను.. అంటూ ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశారు ఈ టెస్లా బాస్.. ఒకవేళ బిజినెస్ పనిమీద ఇతర ప్రదేశాలకు వెళ్తే.. స్నేహితుల ఇళ్లలో ఉండే అదనపు బెడ్‌రూమ్‌లలోనే ఉంటానని పేర్కొన్నాడు.. మరోవైపు, తన వ్యక్తిగత అవసరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే అది చాలా సమస్యాత్మకం అవ్వొచ్చని అభిప్రాయపడ్డ ఆయన.. తన కేసులో అలా జరగదని స్పష్టం చేశారు.. ఎక్కడికైనా వెళ్లాలంటే కనీసం తనకు సొంత నౌక కూడా లేదని తెలిపారు. కానీ, తనకు ఒక విమానం ఉందని, దానిని కూడా ఎక్కువగా వాడనని చెప్పుకొచ్చారు.. తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఏ అవకాశాన్ని వదలకుండా పెట్టుబడులు పెడుతూ వచ్చే ఎలన్ మస్క్.. ఎన్నో కార్లు, బంగ్లాలు, సొంత విమానాలు కూడా ఉంటాయని అనుకుంటాం.. కానీ, ఇప్పటికే తనకు సొంతిళ్లు లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎలన్ మస్క్.
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!